Header Banner

కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఏపీలో తహసీల్దార్లకు కీలక బాధ్యతల అప్పగింత!

  Thu Mar 06, 2025 09:26        Politics

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని జిల్లా కలెక్టర్ నుంచి మండల తహసీల్దార్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గించడంతో పాటు, రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేందుకు ఈ మార్పు దోహదపడుతుందని, మెరుగైన ఫలితాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. నిషిద్ధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములైన అసైన్డ్, నివాస స్థలాల రిజిస్ట్రేషన్ రద్దు అధికారం ఇంతకు ముందు జిల్లా కలెక్టర్లకు ఉండేది. ప్రస్తుతం అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం అందితే, విచారణ జరిపించి, వాటిని రద్దు చేయాలని జిల్లా రిజిస్ట్రార్ ద్వారా సబ్ రిజిస్ట్రార్‌కు తెలియజేస్తారు. ఈ విధానంలో కాలయాపనతో పాటు వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండే తహసీల్దార్లకే నేరుగా రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని కట్టబెడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #Minister #APGovernment #illegalgovernmentlandregistration #AnaganiSatyaPrasad